Posts

Bramanda Nayakuniki Bramosthavam Song Telugu Lyrics

  Bramanda Nayakuniki Bramosthavam Song Telugu Lyrics బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవంll2ll శ్రీ భూ సతులతో శరణాగతులతో శ్రీ భూ సతులతో శరణాగతులతో ఏడు కొండల పైన ఎంచక్కగా బ్రహ్మ రూపునికి బ్రహ్మమోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సురసమూహాల సరసోత్సవం వేంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవం శేష వాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చుll2ll సింహ వాహన శౌరి శౌర్యము నే పెంచు హంసవాహన మెక్కి ఆయివే కలిగించు ముత్యాల వానల్లు మూర్చి తడిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాడ గా బ్రహ్మ రూపునికి బ్రహ్మమోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సురసమూహాల సరసోత్సవం వేంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవం కల్పవృక్ష విహారి కలిదోష హారియై సర్వ భూపాలురకు సిరులను కలిగించు మోహినీ కృష్ణు లుగ మోహము తొలిగించు గరుడ వాహనమెక్కి థనధాస్యములు చూపు హనుమంత సేవలో అభయముద్ర సాధింఛు గజ వాహనమ్ము పై భ్రాంతి నే తొలగించు సూర్యఫ్రభను నెల్చి అక్షీణతను పెంచు శ్రీ వత్స వక్షుడై ఆ చంద్...

Arjuna Krutha Siva Dhandam- అర్జనుడు శివుని పై చేసిన స్తోత్రం.

                                          శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ క్రియాకారణం బంచు నానాప్రకారంబుల్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా  భవానీపతీ నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్ర క్రియాయంత్రవాహుండవై తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన్  నిర్మలజ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్  సదాతృప్తులై నిత్యులై రవ్య యాభవ్య సేవ్యాభవా భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది నానామునిస్తోత్రదత్తావధానా లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా న...

SriSaila Ragada శ్రీశైల రగడ--

  శ్రీశైల రగడ శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము ధారుణి లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుట మైనది బ్రహ్మ నిర్మల బ్రహిశృంగంబులు నిర్మలమగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెఱపిలేని బహు దేవాలయములు పుణ్య స్థలంబులు పుణ్య వనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమ కరంబగు చింతామణులు అమృత గుండంబులు కడు నైష్ఠికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడెటి రాజులు సంతత లింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణ మ్రోగెటి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖ నాదములు వీర శైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరు ధూపములు జపములు చేసెటి జంగమోత్తములు తపములు చేసెటి తాపసోత్తములు ప్రమథులు భక్తులు శైవ గణంబులు గట్టిగ ఇది భూకైలాసమ్మని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ...